ముంబయిలో టీమిండియా రోడ్ షో.. బస్సు డిజైన్ చూశారా?

-

T20 వరల్డ్కప్ నెగ్గిన టీమిండియా 3 రోజుల తర్వాత ఇవాళ భారత్ చేరుకుంది. దిల్లీ ఎయిర్పోర్టులో ఇండియన్ ప్లేయర్స్కు ఘన స్వాగతం లభించింది. మొదట హోటల్ చేరుకున్న ప్లేయర్స్ అక్కడి నుంచి పీఎం నివాసానికి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఇక 17 ఏళ్ల తర్వాత టీ20ల్లో విజయఢంకా మోగించిన సందర్భంగా టీమిండియా ప్లేయర్స్తో ఇవాళ ముంబయిలో భారీ రోడ్ షో ఉండనుంది. ‘విక్టరీ పరేడ్’ పేరుతో బీసీసీఐ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది.

ఈ రోడ్ షో కోసం బీసీసీఐ ఓ బస్సును ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్‌ టాప్‌ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్‌ షోలో పాల్గొనేలా డిజైన్ ఉంది. బస్సుపై టీ20 విజయం తర్వాత టీమ్ అంతా కప్పు తీసుకుంటున్న ఫొటో స్టిక్కర్ను డిజైన్ చేశారు. ఈ ఫొటోలో టీమ్ఇండియా ప్లేయర్లతోపాటు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. ‘ఛాంపియన్స్ 2024’, బీసీసీఐ లోగోలు బస్సుపై ఉంచారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news