హాస్యం – ‘క్యాండిల్‌ ఆర్పడానికి వెళ్లారు’

-

ఒక మ్యారేజ్ ఫంక్షన్లో మేరీకి ఫాదర్ విన్సెంట్ కలిశారు. “ఏం మేరీ !!బాగున్నావా ?? మీ పెళ్లి జరిపించిన ఫాదర్ నేనే గుర్తున్నానా ”

“ఆ గుర్తొచ్చింది ..ఐయాం గ్లాడ్ ఫాదర్ ”
“చెప్పమ్మా ..ఎలా వుంది సంసారం ?? ”
“ఏం చెప్పమంటారు ఫాదర్ ..అంతా బానేవుంది ..ఒక్కపిల్లలు లేరనే కొరత తప్ప ..”

“అవునా ..నేను త్వరలోనే వాటికన్ సిటీ వెళ్లబోతున్నా ..అక్కడ మీకు సంతానం కలగాలని ఒక క్యాండిల్ వెలిగిస్తాను ..బాధపడకు ”

“థాంక్యూ ఫాదర్ ..”

నాలుగేళ్ల తర్వాత ఫాదర్ విన్సెంట్ కి మేరీ మళ్లీ కన్పించింది ..

“ఏమ్మా ఇపుడెలా వున్నారు ?? ”
“హా బానేవున్నాం ఫాదర్ ”
“పిల్లలా ఏమన్నా ”
“హా తొలికాన్పులో ట్విన్స్ పుట్టారు ఫాదర్ ..తర్వాత కాన్పులో ముగ్గురూ ..ఆపై రెండు కాన్పుల్లో ఒక పాపా ఇద్దరు బాబులునూ ”
“ఆహా సంతోషం ..ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా ??”
“వాటికన్ సిటీకి వెళ్లారండీ ”
“అవునా ఏమన్నా పనిమీద వెళ్లారా ?”

“హా ..మీరు వెలిగించిన క్యాండిల్ ఆర్పటానికి వెళ్లారు ..”

Read more RELATED
Recommended to you

Latest news