MLA Prakash Goud : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కీలక ప్రకటన చేశారు. స్వామి వారి దర్శనము తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నానని తెలిపారు తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. యువకుడు అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.
సాయంత్రం ఏడు గంటలకు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అని వివరించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కేసీఆర్ బాగానే చేశాడు.. కానీ రేవంత్ కోసం వెళుతున్నానని తెలిపారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చాలా పథకాలు అమలు చేశారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నారని తెలిపారు. తన నియోజక వర్గం అభివృద్ధి చేసుకోవడం తన కు ముఖ్యమని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించు కున్నానన్నారు.