అమ్మాయిల చదువును తప్పుబట్టిన పాక్ యూట్యూబర్ సాంగ్..!

-

ప్రస్తుతం అమ్మాయిలు మాకు ఏదీ సాటికాదు.. మేము అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం అనుకునే ఈ రోజుల్లో  ఇంకా కొందరు మత ఛాందసవాదులు వారి చదువుపై అభ్యంతరం చెప్పుకొస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియోతో కూడిన పాటను విడుదల చేశారు. హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ అనే యూట్యూబర్ తన పాటకు ‘అప్నీ దీ స్కూలో హాతా లే ఓథీ డ్యాన్స్ కర్డీ పాయీ ఆయీ’ అనే పేరు పెట్టాడు. ‘మీ అమ్మాయి బడిలో డ్యాన్స్ చేస్తున్నందున ఆమెను పాఠశాల మాన్పించండి’ అనేది ఆ పాట యొక్క సారాంశం. ఇస్లాం మతాచారం ప్రకారం.. అమ్మాయిలు డ్యాన్సులు చేయడం అంగీకారయోగ్యం కాదని చెప్పుకొచ్చాడు.

పాఠశాలలకు బాలికలు వెళ్లడం వల్ల పవిత్రత, గౌరవం కోల్పోతారని పేర్కొన్నాడు. యునెస్కో సూచనతో పాకిస్తాన్ లోని ఓ స్కూల్ బాలికలకు డ్యాన్స్ పోటీ నిర్వహించినట్లు ఓ వార్తా సంస్థ చూపించడంతో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అందుకు ప్రతిగానే ఈ పాటను రూపొందించినట్లు సదరు యూట్యూబర్ హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ పేర్కొన్నాడు.అతను స్వరపరిచిన ఆ పాటలోని సాహిత్యం కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో.. తమ ఇళ్లలోని అమ్మాయిలను వేశ్యలుగా మార్చాలనుకొనే వారు తప్ప ఎవరూ బడికి పంపొద్దని సూచించేలా పాట పాడాడు. ఈ వీడియోకు సుమారు 3 లక్షల వ్యూస్, 3 వేలకుపైగా లైక్ లు రావడంతో పాకిస్తాన్ లో మతఛాందసవాదం ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news