Telangana : రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు

-

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18వ తేదీ (గురువారం) నుంచి డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్షలు ఆగస్టు 5వ తేదీకి ముగుస్తాయని వెల్లడించారు. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు.

మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయని పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వస్తున్నారని.. ఈ నేపథ్యంలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

 

డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..

 

జులై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష

జులై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష

జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు

జులై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష

జులై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌ పరీక్ష

జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

Read more RELATED
Recommended to you

Latest news