న్యూ ఇయర్ వేడుకలు జాగ్రత్త, యువత తీసుకునే జాగ్రత్తలు ఇవే…!

-

ప్రపంచ వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అన్ని దేశాల్లో న్యూఇయర్ సందడి నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సందడి ఎక్కువగానే ఉంది. ఈ నేపధ్యంలోనే పలువురు, యువతకు కీలక సూచనలు చేస్తున్నారు. యువత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరిస్తున్నారు. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం.

ముందు తల్లి తండ్రులు;

ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనే దానిపై పూర్తి సమాచారం సేకరించడం.

వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటం, దగ్గరి పార్టీలకు మాత్రమే పంపడం.

ఎవరితో వెళ్తున్నారో వాళ్ళ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం. వారి కుటుంబ సభ్యుల నంబర్లు తీసుకోవడం.

ఏ విధమైన పార్టీకి వెళ్తున్నారు…? విద్యార్ధులు అయితే ఎవరితో కలిసి వెళ్తున్నారు…?

పబ్ లకు వెళ్తే ఏ పబ్ లకు వెళ్తున్నారు…? ఆ పబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ…?

యువత;

తాగి వాహనాలు నడపకపోవడం.

స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు ద్విచక్ర వాహనాల మీద వెళ్లి పార్టీలకు హాజరు కాకపోవడం.

నగరాల్లో ఉండే యువత మద్యం సేవి౦చే విధంగా ఉంటే తాగి అక్కడే నిద్రించడం.

మత్తు పదార్ధాలు ఉన్న పబ్ లకు, పార్టీలకు దూరంగా ఉండటం.

అక్కలు, చెల్లెళ్ళు ఉంటే ఎక్కువగా అబ్బాయిలు ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం.

సముద్ర తీరాలకు, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం.

Read more RELATED
Recommended to you

Latest news