శ్రీనివాస కల్యాణం ట్రైలర్.. హిట్టు పక్కా..!

-

దిల్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేయగా కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఫుల్ కాన్సెప్ట్ అర్ధమయ్యేలా చెప్పారు.

జీవితంలో ఒక్కసారి వచ్చే పండుగ పెళ్లి అంటూ పెళ్లి విశిష్టను చెప్పే సినిమాగా వస్తుంది శ్రీనివాస కళ్యాణం. ఇక ఆల్రెడీ హిట్ అయిన మ్యూజిక్ ట్రైలర్ లో మరోసారి మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా కళ్యాణం.. కమనీయం సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ట్రైలర్ కే అందం తెచ్చింది. నితిన్, రాశి ఖన్నా జంట బాగుంది.

మిక్కి జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం కాగా.. మరోసారి శతమానం భవతి లానే సతీష్ ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ తో వస్తున్నాడు. ఆగష్టు 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఈ ట్రైలర్ మహేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news