పార్లమెంట్ లో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ పై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సుజనా చౌదరీ మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఏపీకి శుభదినం అనే చెప్పాలి. ఏపీ అవసరాలు గుర్తించి కేంద్రం నిధులు కేటాయించింది. అమరావతి రాజధాని అని బీజేపీ గతంలో తీర్మాణం చేసింది. బీజేపీ అమరావతికి సపోర్ట్ గా ఉంది.
జగన్ రాజధాని విషయంలో మూడు ముక్కలు ఆట ఆడారు. శాసన రాజధాని అని చెప్పినా ఏ అభివృద్ది అమరావతిలో జగన్ చేయలేదు. అమరావతికి 15 వేల కోట్లు ఇస్తామని చెప్పటం సంతోషకరం. పోలవరానికి పదేపదే నిధులు అడగాల్సిన అవసరం లేదు. నాబార్డు తో నిధులకు లింకు చేశాం. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ను జగన్ సర్కారు నాశనం చేసింది. ప్రత్యేక హోదా అంశాన్ని ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఏం చేసింది..? అని ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ తీసేసిన తర్వాత ప్రత్యేక హోదా అనే పదానికి అర్ధం లేదు. రాజకీయ అవసరాల కోసం మాత్రమే హోదా ప్రస్తావన అంశం వైసీపీ తెచ్చింది. ఉనికి కోల్పోయిన వైసీపీ ఢిల్లీ లో చేస్తున్న ధర్నల వల్ల ఉపయోగం లేదు. హోదా కంటే ఎక్కువగా నిధులను కేంద్రం ఇచ్చిందని తెలిపారు సుజనా చౌదరీ.