మేడి గడ్డ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర..!

-

మేడి గడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉంది అనే అనుమానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వ్యక్తం చేసారు. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుంది. ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుంది.

ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసు. వారు బారేజ్ ను ఏమైనా చేయగలరు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోంది. NDSA రిపోర్టు ను అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదు. కానీ అది NDSA రిపోర్టు కాదు అది NDA రిపోర్టు. ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమే అయితే 2 టీ ఎం సీ ల నీరు ఎత్తి పోస్తే సరిపోదు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు అని KTR కామెంట్స్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news