పారిస్ ఒలింపిక్స్ లో మన ప్లేయర్స్ ను సపోర్ట్ చేయండి.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత అథ్లెట్లకు దేశం మొత్తం మద్దతుగా నిలవాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇవాళ నిర్వహించిన 112వ మన్ కీ బాత్లో ఆయన మాట్లాడారు. ప్రపంచం ఎదుట భారత పతాకాన్ని రెపరెలాడించే అరుదైన అవకాశం వారికి ఉందని.. అందుకే మనం వారిని కచ్చితంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

అసోంలోని చారిడియోను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. భారత్‌లో 43వ యునెస్కో సైట్‌గా అది నిలిచిందని పేర్కొన్నారు. మరోవైపు ఆగస్టు 7న చేనేత ఉత్పత్తుల దినోత్సవం జరుపుకుంటున్నామని.. చేనేత ఉత్పత్తులను ప్రజలంతా ఆదరించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఖాదీ వస్త్రాల కొనుగోళ్లు 400 శాతం పెరిగాయన్న ప్రధాని మోదీ.. మై ప్రొడక్ట్‌ మై ప్రైడ్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. ఈ చిన్న ప్రయత్నం లక్షలమంది జీవితాల్లో వెలుగులు నింపుతాయని వ్యాఖ్యానించారు. ఆగస్టు నుంచి ప్రజలంతా ఖాదీ వస్త్రాలే కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీంతో చేనేత వస్త్రకారులకు, మహిళలకు ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. డ్రగ్స్‌ కట్టడికి, బాధితుల రీహాబిలిటేషన్‌ కోసం కొత్త పోర్టల్‌ ఏర్పాటు చేశామని.. మానస్‌ పోర్టల్‌ను సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ప్రధాని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news