హరీష్ రావు, కేటీఆర్ లు ప్రజలను క్షమాపణలు కోరాలి..!

-

కాంగ్రెస్, BRS నాయకుల మధ్య మాటకు మాట ఓ రేంజ్ లో నడుస్తుంది. అయితే తాజాగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జగదీష్ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఏళ్లుగా పూర్తి చేయలేదు. వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు. కానీ ఇప్పుడు సత్యహారి చంద్రుడి గా మాట్లాడుతున్నారు అని కామెంట్స్ చేసారు. ప్రాజెక్టు 50 శాతం పూర్తి అయ్యాక DPR కేంద్రానికి ఇచ్చారు. పర్యావరణ అనుమతులు కూడా ఉండవు. ప్రపంచంలో ఎక్కడ ఏ బ్యారేజ్ కూడా 5 మీటర్ల కన్నా ఎత్తు ఉండవు. ఆ బ్యారేజ్ గేట్లు ఎత్తడానికి వారం రోజులు పట్టింది అని పేర్కొన్నారు.

అడ్డగోలుగా కాళేశ్వరం లా డిజైన్ చేశారు. కాబట్టి తప్పు చేసినందుకు హరీష్ రావు,కేటీఆర్ లు క్షమాపణలు ప్రజలను కోరాలి. చిట్ చాట్ లో హరీష్ రావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ భువనగిరి హాస్పిటల్ లో కరెంటు కట్ జరిగిన 5 నిముషాలు మాత్రమే జరిగింది అని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news