ఏపీ అధికారులంటే చేతకాని వాళ్లు… అన్నట్టు చూస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించిందన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే విధంగా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారుల మనో ధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బ తీసే విధంగా వ్యవహరించిందన్నారు.
ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారని… ఏపీలో పని చేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారని పేర్కొన్నారు. కానీ గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందని చెప్పారు. ఏపీ ఆఫీసర్లు అంటే అంటరాని వాళ్లను చూసినట్టు చూస్తున్నారని….ఏపీ అధికారులంటే ఏం చేయలేరు.. చేతకాని వాళ్లు అన్నట్టు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.