ఏపీ రైతులకు నారా లోకేష్ శుభవార్త చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని… భూసార పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17 కోట్ల ఆర్థిక సాయం చేశామని… ఈ సీజన్లో 29 వేల కౌలు రైతులకు, 30 కోట్ల రుణాలు అందిస్తామని ప్రకటించారు. రైతు బజార్ల ద్వారా ప్రజలకు కూరగాయలు అందిస్తున్నామన్నారు.
గుంటూరు, తెనాలి, దుగ్గిరాల మార్కెట్ యార్డులో ఈ నాం ద్వారా పంటలు అమ్మకాలు జరిపిస్తున్నాని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా, ఏపిలో నైపుణ్య గణన కూడా జరుగుతుంది…ఉచిత ఇసుక, హామీ అమలు చేస్తున్నామన్నారు. సి ఆర్ డి ఏ ద్వారా అమరావతి పనులు వేగవంతం చేస్తామని… పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం… యువతకు 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యమని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే డీఎస్సీ కూడా ప్రకటించాం.. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ల ను ప్రారంభిస్తున్నామన్నారు.