టీటీడీ పరిపాలన చాలా కష్టతరంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. టీటీడీలో 100కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతి నుండి నాయకులు చేతిలోకి చేరాయి. ఈ 100కోట్ల రూపాయలు ఎవరు ఎవరికి ఇచ్చారన్న విషయం బయటకు రావాలి. టీటీడీ ఏడీ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది. ఎవరి తప్పులను కప్పి పెట్టేందుకు అగ్ని ప్రమాదాన్ని సృష్టించారు అని ప్రశ్నించారు.
అలాగే పొలవరం పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత వరకు ఖర్చు చేసిందన్న విషయాన్ని ప్రజలకు తెలపాలి. పొలవరం పొలిటిషియన్ లకు వరంగా మారింది. చంద్రబాబు నాయుడు బాహుబలి కాదు బలహీన బలిలా ఉన్నాడుఅని పేర్కొన్నారు. రెండు నెలలైనా ఆర్టీసీ బస్సులు దుమ్ము దూలపలేదు. చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులను శుభ్రంగా ఉంచాలి. అహీ విధంగా దేశంలో చాలా అత్యాచార ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని బీజేపీ.. కోల్ కత్తా మెడికల్ కాలేజీ అత్యాచార ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోంది అని చింతామోహన్ పేర్కొన్నారు.