మీ ఎమ్మెల్యే డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు..!

-

ఎవడైనా ఎగస్ట్రాలు చేస్తే వాళ్లని బట్టలు ఊడదీసి కొడతాం అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా ముద్ధిగుప్పం పంచాయతీలో గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యే చూసి రా అంటే కాల్చి వచ్చే రకం. ఇక్కడ ఎవరి పప్పులు ఉడకవు. ఎవరైనా తెలుగుదేశం భూములను కబ్జాచేసి ఉంటే నాకు తెలియజేయండి. మీ భూమి మీకు తీసి ఇచ్చే బాధ్యత నాది. మీ భూములవి మీకు రాచ మర్యాదలతో రాజా ముద్ర వేసి మీకిచ్చే బాధ్యత నాది.

మీ ఎమ్మెల్యే సేవ చేయడానికి వచ్చాను మీ ఎమ్మెల్యే టిప్స్ తీసుకున్నాడు అని ఆరోపణలు చేస్తే నమ్మకండి. నేను టిప్స్ తీసుకునే వ్యక్తి కాదు.. ఎవరైనా మా తమ్ముడు మా అన్న మా బంధువు అని చెప్తే నమ్మవద్దు. ఏదైనా ఉంటే నాకు వాట్స్అప్ చేయండి నేను ఫాలోఅప్ చేస్తాను. మీ ఎమ్మెల్యే డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు కరెక్ట్ గా ఉన్నాడు మీకు న్యాయం చేస్తాడు. మీరు ఎక్కడ తగ్గదండి.. మీకేం కావాలన్నా అధికారులకు అర్జీ రూపంలో తెలియజేయండి.. అధికారి పని చేయలేదంటే నాకు అర్జీ ఇవ్వండి వాళ్ళని వెంటనే తొలగిస్తాను అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రజలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news