కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్..!

-

వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ మా సంస్థలను బ్యాన్ చేయాలని.చూసినా ప్రజల నుండి ఉన్న ఆదరణతో ఏమి చేయలేకపోయారు అని ఎమ్మెల్యే వివేక్ వెంకటసామి అన్నారు. మీడియా హౌస్ ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో నాపై ఈడి రైడ్స్ చేయించారు. మేము తప్పు చేయలేదని మా డబ్బులు మాకు ఇచ్చారు. ఎవరిదో చూపించి నా ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ అని ఆయన తెలిపారు.

మేము కొన్నప్పుడే మా ఫామ్ హౌస్ కు  కాంపౌండ్ వాల్ ఉంది. FTL, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే మా ఫామ్ హౌస్ ఉంది. సొంత చెల్లెను గెలిపించుకోలేని కేటిఆర్ లీడర్ ఎలా అయితడు. ఇక ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికి తెలుసు. కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నా పై చేసిన ఆరోపణలు నిరూపించు అంటూ కేటిఆర్ కు నా సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేయండి. నా సంస్థలు అన్ని ఎక్కడ తప్పులు లేకుండా నడిపిస్తున్న. 2019 తరువాత TRSకు వ్యతిరేకంగా చాలా కీలకంగా పని చేశాను. వారిని గద్దె దించే వరకు వ్యతిరేకంగా పని చేశాను.. ప్రశ్నించాను అని వివేక్ వెంకటసామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news