అత్యవసర పరిస్థితి లో కీలక నేత పార్టీ కి రాజీనామా – తలపట్టుకున్న చంద్రబాబు !! 

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతోంది. ముఖ్యంగా టిడిపి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వయసు మీద పడటం తో ఆ పార్టీలో ఉన్న నేతలు తమ భవిష్యత్తు రాజకీయాలు గురించి తెగ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కుర్ర నాయకుడు వైయస్ జగన్ అవ్వటంతో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పరిపాలన అందిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే చాలా మంది వైసీపీ పార్టీలోకి వెళ్ళటానికి రెడీ అయిన నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో మూడు రాజధానుల పేరిట జగన్ తెరపైకి తెచ్చిన సరికొత్త వాదంపై ఎప్పుడు ఇప్పుడే జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల నుండి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి కీలక నేత రాజీనామా చేసిన ఘటన చంద్రబాబుకి తలపట్టుకున్న టు అయిందని తెలుగు దేశం పార్టీ లో వినపడుతున్న టాక్.

 

మేటర్ లోకి వెళితే తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పార్టీ వీడనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యువ నాయకుడు తెలుగుదేశం పార్టీని వీడటం తో ఎంతో నమ్మకంగా పార్టీకి పనిచేసే నాదెండ్ల బ్రహ్మం చౌదరి వెళ్లి పోవడం పట్ల చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు పార్టీ నుండి అందుతున్న సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news