జగన్ కు షాక్.. ఇవాళ ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా !

-

జగన్ మోహన్ రెడ్డి కి మరో షాక్ తగిలింది. ఇవాళ నేడు పార్టీకి, పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారట.

A shock to Jagan Two YCP MPs resigned today

దింతో జగన్ మోహన్ రెడ్డి కి మరో షాక్ తగిలింది. అయితే పార్టీ మారడంపై తాజాగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఎవరు నమ్మకూడదని కోరారు. తాను వైసిపి పార్టీకి విధేయత అలాగే అంకితభావం నిబద్ధత కలిగిన కార్యకర్తలని ఆయన స్పష్టం చేశారు. జన్మలో కూడా వైసీపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలిపారు. తన ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తానని వెల్లడించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news