ఏపీలో ఏడుగురు ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు..!

-

ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదొన్నతులు, పోస్టింగులు ఇచ్చారు. ఏఎస్పీలుగా ఉన్న ఏడుగురికి నాన్ కేడర్ ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఎం కృష్ణమూర్తి నాయుడు, శోభా మంజరి, బి ప్రసాద రావు, వర్మ, సోమశేఖర్ రావు, కేవీఆర్కే ప్రసాద్, రాజశేఖర్ రావుకు పదోన్నతులు లభించాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా ఎం కృష్ణమూర్తి నాయుడు నియమితులు అయ్యారు.

అలాగే ఆర్టీసీ ఎస్పీగా శోభా మంజరి.. విజిలెన్స్ ఎస్పీగా ప్రసాద రావు.. మెరైన్ ఎస్పీగా వర్మ… కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా సోమశేఖర్ రావు… ఏపీ ట్రాన్సుకో విశాఖ ఎస్పీగా కేవీఆర్కే ప్రసాద్.. ఏసీబీ ఎస్పీగా రాజశేఖర్ రావు… సీఐడీ ఎస్పీగా చక్రవర్తి ఎంపిక అయ్యారు. ఇక మొత్తం 32 మంది డీఎస్పీలకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా ప్రమోషన్లు ఇస్తూ.. ఈ మేరకి ఉత్తర్వులు జారీ చేసారు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్.

Read more RELATED
Recommended to you

Latest news