మహిళలకు శుభవార్త. అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. ఏకంగా ఒక్కొక్కరూ 1,62,000 వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ఇది ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చూసేయండి. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణతో ఉపాధి పొందుతున్న మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులని కేంద్రం తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో పాడి రైతులు బెనిఫిట్ ని పొందడానికి అవుతుంది. ఈ స్కీంలో భాగంగా ఒక్కో పాడి రైతుకి 1.62 లక్షల వరకు లోన్ ఫెసిలిటీని కల్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదివేల కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులు ఎవరైనా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ పశు వైద్య కార్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవడానికి అవుతుంది. అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పంపించిన దరఖాస్తుల్ని జిల్లా అధికారులు లీడ్ బ్యాంకు మేనేజర్ కి పంపిస్తారు. వారు పరిశీలన చేశాక లోన్ ఫెసిలిటీ కల్పిస్తారు.
ప్రతి మండలంలో దాదాపు 300 మంది మహిళా పాడి రైతులకు ఈ పథకంలో చేరడానికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ లో చేరి బెనిఫిట్ ని పొందవచ్చు. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాలకు నగదును బ్యాంక్ అధికారులు జమ చేస్తే పశు పోషణకు కావలసిన వాటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణాన్ని 40 రోజుల్లో తిరిగి జమ చేస్తే ఏ వడ్డీ కూడా ఉండదు. అదే ఒకవేళ చెల్లించకపోతే ఏడు శాతం వడ్డీని చెల్లించాలి. ఇందులో మీకు మూడు శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తుంది.