సహాయక చర్యల ఆలస్యం పై చంద్రబాబు ఆగ్రహం

-

ఆంధ్రప్రదేశ్‎లో రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో వరద తీవ్రత ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బాధితులకు సహాయక చర్యలు సరిగ్గా అందడం లేదని గుర్తించారు.  దీంతో సీఎం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. బాధితులకు సరిపడా ఆహారాన్ని తెప్పించినప్పటికీ.. ఎందుకు అందజేయలేదని సీరియస్ అయ్యారు. ఆహారం పంపిణీ ఆలస్యం చేసిన అధికారులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, పని చేయడం ఇష్టం లేకుంటే మానేయాలని చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news