వరదల్లో జేసీబీపై 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు..!

-

ఈరోజు సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటనతో పరుగులు పెట్టారు సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు. వరదలో జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించారు సీఎం చంద్రబాబు. కాన్వాయిని వీడి 22 కిలోమీటర్ల మేర చంద్రబాబు పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు. ప్రతిపక్షంలోనూ ఇంత సేపు కాన్వాయిని వీడి ఉండలేదటున్నాయి చంద్రబాబు భద్రతా వర్గాలు. ఇక వరద ప్రాంతంలోకి సీఎం చంద్రబాబు జేసీబీపై వెళ్లడంతో రోడ్ల పైనే చక్కర్లు జొట్టింది ఆయన కాన్వాయి.

భవానీపురం, సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో జేసీబీపై సీఎం పర్యాటించగా.. ఒక పాయింట్ నుంచి మరో పాయింటుకు వెళ్లాలని స్పాటులోనే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇక వరద పర్యటన అనంతరం కూడా సీఎంను కాన్వాయి చేరుకోలేకపోవడంతో.. వరద లేని ప్రాంతంలో కూడా కొంత దూరం జేసీబీ పైనే పర్యటించి రామవరప్పాడు వద్ద కాన్వాయికి చేరుకున్నారు చంద్రబాబు. ఇక వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news