కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి నాడు మౌనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ఉపాధ్యాయులు తలచుకుంటే విద్యార్థుల తలరాతలే కాదు.. ప్రభుత్వాలు సైతం కూలిపోతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో టీచర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేకపోయిందన్నారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటివారంలో జీతాలు పడుతున్నాయంటే అది బీజేపీ చేసిన పోరాట ఫలితమేనన్నారు. ఇవాళ కరీంనగర్ లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురు వందనం కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెం.317తో చెట్టుకొకరినీ, పుట్టకొకరినీ చేస్తే.. మీకోసం పోరాడి తాను జైలుకు కూడా వెళ్లానని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడి, అత్యధిక కేసులు ఉన్న ఎంపీని తానేని తనపై 109 కేసులున్నాయని వెల్లడించారు. కేసీఆర్ అరాచక పాలనకు భయపడి గతంలో ఉపాధ్యాయ సంఘాలు సైతం మౌన పాత్ర పోషించాయన్నారు. ఆనాడు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. డీఏలు, ప్రమోషన్లు ఆగేవి కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news