మోడీ 100 రోజుల పాలనకు చర్చకు సిద్ధం : ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 100 రోజుల పాలన పై చర్చించేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించారు రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్.  6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. వరుసగా మూడు సార్లు ప్రధాని అయిన ఘనత మోడీకే దక్కింది. మోడీ పాలన ప్రజలకు నచ్చే ఎన్నికల్లో గెలిపించారు. మోడీ పాలన పై డిబెట్ నిర్వహిద్దాం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చర్చించాలన్నారు. మోడీ 100 రోజుల పాలన పై తాము చర్చించేందుకు సిద్దం అన్నారు. 

కాంగ్రెస్  ఇచ్చిన హామీల్లో మహిళలకు రూ.2500 ఏమైంది.. రైతులకు రైతు భరోసా ఏమైంది. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత కేసీఆర్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్ పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మరో వైపు రాహుల్ గాంధీ దేశం యొక్క పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అమెరికాలో దేశం పరువు తీస్తారు. మళ్లీ కాంగ్రెస్ నేతలు నిరసన చేస్తారు. ప్రదాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేయడం దారుణం అన్నారు.  దేశం పరువు తీసినందుకు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్దం చేయాలన్నారు ఎంపీ కే.లక్ష్మణ్. 

Read more RELATED
Recommended to you

Latest news