నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తాం : చంద్రబాబు

-

మనం చేస్తున్న పనులను చెప్పుకుంటూనే.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. వైఎస్ వివేకా హత్యపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్దంగా తిప్పికొట్టలేకపోయాం అని సీఎం చంద్రబాబు అన్నారు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. త్వరలో భర్తీ చేస్తాం. 6 వేల మంది ఎల్జీ పాలిమర్స్ బాధితుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు 100 రోజుల పాలనపై ప్రచారం చేపట్టాలి. కేంద్రం, రాష్ట్రం చేసిన పనులు.. భవిష్యత్తులో చేసే పనులను చెప్పాలి. ప్రజలు మనల్ని గెలిపించారు కాబట్టి.. ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది.

ఢిల్లీలో గౌరవం పెరిగింది కాబట్టే.. పనులు అవుతున్నాయి. 175 గెలుస్తామనో.. 40 ఏళ్లు మనమే ఉంటామని ప్రజలకు చెప్పడం కాదు.. ప్రజలతోనే మేం ఉంటాం అని చెప్పాలి. నెలలో పది రోజులపాటు ప్రజల్లో ఉండాలి. జిల్లాల్లో ప్లానింగ్ బోర్టు మినిస్టర్లను నియమిస్తాం. జిల్లాల్లో మూడు పార్టీలు సమన్వయంతో పని చేసుకోవాలి. ప్లానింగ్ బోర్డు మినిస్టర్లు కూడా సమన్వయం చేసుకోవాలి. రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలి. అభ్యర్థులు ఎవరో త్వరలో చెబుతాం. ప్రభుత్వ ప్రొగ్రాం చేద్దాం.. కానీ పార్టీ భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలి అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news