గత కొన్నేళ్ళు గా యోగాకు ప్రాధాన్యత పెరిగింది. భారతీయ సంస్కృతిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంది గాని ప్రాచుర్యంగాని మన భాషలో చెప్పాలంటే క్రేజ్ గాని వచ్చింది గత నాలుగు అయిదేళ్ళలోనే. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది కూడా ఒకటి వచ్చేసింది. యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో వ్యాధులకు కూడా అది పరిష్కారం చూపిస్తుందని వైద్యులు కూడా అంటూ ఉంటారు.
ఈ నేపధ్యంలో కొన్ని ఆసనాల గురించి ఒకసారి చూద్దాం.
గరుడాసన
గరుడాసనంలో ఒకే అంశం మీద మనసు లగ్నం చేయాలి. ఈ ఆసనం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. భుజాలు, తుంటి భాగంలోని కండరాలు రిలాక్స్ అవడానికి సహకరిస్తుంది.
యోగ నిద్ర
దీని శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగా విశ్రాంతి పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఇది ఎంతో ఉపయోగం.
ఉత్థానాసన౦
విపరీతమైన ఆలోచనలు ఉండి ఆందోళనగా ఉండే వారికి గాను మనసు నిశ్శబ్దంగా ఉండటానికి, నెర్వ్ససిస్టమ్ బ్యాలెన్స్ కావడానికి ఈ ఆసనం ఎంతో ఉపకరిస్తుంది.
వజ్రాసన౦
వజ్రాసనం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవచ్చు. శరీరం, మనసు ప్రశాంతతకు సహకరిస్తుంది.