రివ్యూ; దర్బార్ సోషల్ మీడియా రివ్యూ, రజిని ఈజ్ బ్యాక్…!

-

రజని కాంత్ సినిమా అంటే చాలు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా కోసం వ్యాపారాలు, ఉద్యోగాలు, స్కూల్స్ అన్ని మానుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రజని కాంత్ సినిమా దర్బార్ వచ్చేసిది. సంక్రాంతి సీజన్ కు తన సినిమాతో స్వాగతం చెప్పేశారు రజని. గురువారం సినిమా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అంటుంది సోషల్ మీడియా.

మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకునే రజని కాంత్ ఈ సినిమా ద్వారా మరోసారి తన మార్క్ చూపించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుమ్మురేపారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది దర్బార్. రజని ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తూ రజని కాంత్ కెరీర్ లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు. రజని నుంచి ప్రేక్షకులు ఎం కోరుకున్నారో అది దొరికిందట.

70 ఏళ్ళ రజని కాంత్ ఎనర్జీకి ప్రేక్షకులు కేరింతలు కొట్టారని సోషల్ మీడియా అంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్ లో రజని నటన ఒక బాషా, నరసింహా రేంజ్ లో ఉందని, సంక్రాంతికి గ్రాండ్ వెల్కం చెప్పాడని సోషల్ మీడియా కామెంట్ చేస్తుంది. వాస్తవానికి రజని సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. గత సినిమాలు అన్నీ ఫ్లాపులు అవడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నారు కాని రజని వారికి ఫుల్ కిక్ ఇచ్చారని సినిమా సూపర్ అంటుంది సోషల్ మీడియా.

Read more RELATED
Recommended to you

Latest news