Tirumala Laddu : జగన్ కు బీజేపీ నేత స్ట్రాంగ్ కౌంటర్.. చర్చకు సిద్దమా..? అంటూ..!

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లడ్డు వివాదం పై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, కూటమి నేతలు కల్తీ నెయ్యి వల్లనే లడ్డు ప్రసాదం కల్తీ అయిందని.. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని రిపోర్టులో వచ్చిందని వెల్లడించారు. అలా జరగకపోతే రూ.320కే నెయ్యి ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ మాత్రం అది అంతా డైవెర్షన్ రాజకీయాల కోసమేనని పేర్కొనడం గమనార్హం.

తాజాగా ఢిల్లీలో బీజేపీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ  అధినేత, మాజీ సీఎం జగన్ కి తిరుమలలో  జరిగిన అపచారాల పై సామాన్య బీజేపీ కార్యకర్తతో చర్చకు సిద్ధమా అంటూ వల్లూరు జయప్రకాశ్ నారాయణ సంచలన సవాల్ విసిరారు.  తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను జంతువుల కొవ్వు తో అపవిత్రం చేయడమే కాకుండా.. బీజేపీ పెద్దలకు తెలుసు అని మాట్లాడుతున్న జగన్ బీజేపీ నేతతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మమే ఊపిరిగా, దేశ భద్రతే ప్రాణంగా బతికేది బీజేపీ మాత్రమేనని అన్నారు. నేడు అయోధ్య, కాశీ, ఉజ్జయిని నుంచి.. ప్రపంచమంతా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news