ఓపికపోతే రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతాయి : హరీష్ రావు

-

ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుంది అని హరీష్ రావు అన్నారు. మొన్న సిద్దిపేట లో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్ లా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు. నిన్న జరిగిన దాడి కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించిందే. ఉద్దేశపూర్వకంగా నే మాపై దాడి చేశారు. ఎస్పీ, ఐజీతో మాట్లాడను వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. వీడియోలు తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కాంగ్రెస్ న్నాయకులు దాడి చేశారు.

ఒకప్పుడు తెలంగాణ పోలీసులు మంచిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పని చేస్తున్నారు. గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి…వాళ్లపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. ఈ ఘటనపై అవసరం అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. కోర్టు మెట్లు ఎక్కుతాం.. మా ఓపికకి కూడా హద్దు ఉంటుంది. ఓపికపోతే రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతాయి. డీజీపీఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. డీజీపీ స్పందించకపోతే BRS ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హరీష్ రావు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news