కూటమిలో చిచ్చు రేపిన తొలి విడత నామినెటెడ్ పోస్టుల ప్రకటన.. అసంతృప్తిలో బిజేపీ నాయకత్వం..

-

కూటమి ప్రభుత్వం వందరోజులు ముగియడంతో సీఎం చంద్రబాబునాయుడు నామినెటెడ్ పదవుల పందేరంపై దృష్టి పెట్టారు.. మంగళవారం 20 రాష్ట స్థాయి నామినెటెడ్ పదవులను భర్తీ చేశారు.. అందులో టీడీపీకి పదహారు.. జనసేనకు మూడు. బిజేపీకి ఒక్కటే దక్కింది.. అది కూడా పురందేశ్వరీ సిఫారసు చేసినవారికి రాకపోవడంతో ఆమె చంద్రబాబు తీరుపై గుర్రుగా ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.

ఇటీవల ఏపీ బిజేపీ ఛీప్ పురందేశ్వరీ చంద్రబాబునాయుడుతో బేటీ అయ్యారు.. నామినెటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు..ఇదే సమయంలో బిజేపీ మాజీఅద్యక్షులు సోము వీర్రాజు, రాష్ట ఉపాధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి పేర్లను ఆమె పార్టీ తరపున ప్రతిపాదించారు..తొలి విడతలో వారికి అవకాశం కల్పించాలని కోరారట.. దీనికి చంద్రబాబు నుంచి ఆశించిన స్పందన రాలేదని.. కానీ పొత్తు ధర్మం కోసమైనా.. పదవులు ఇస్తారని బిజేపీ నాయకత్వం భావించింది.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఇద్దరు నేతలూ.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారని చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీలో చర్చ కూడా నడిచింది.. కానీ పదవులు ఇస్తారని బిజేపీ నేతలు ఆశించారు..

దుర్గ గుడి ఛైర్మన్ పదవితో పాటు మరికొన్న కీలక పోస్టులను తమకు ఇవ్వాలని పురందేశ్వరీ ప్రతిపాదన పెట్టిందట.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజుకు, రాయలసీమకు చెందిన విష్ణువర్దన్ రెడ్డికి ఇస్తే రెండు ప్రాంతాలను సమన్యాయం చేసినట్లు అవుతుందని పురందేశ్వరీ భావించారట.. కానీ చంద్రబాబు మాత్రం తొలి విడతలో వారిద్దరికి పోస్టులు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన లంకా దినకర్ కు పదవి దక్కడంపై కమలం పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి..

పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి పదవులు దక్కకుండా..వలస నేతలకు నామినెటెడ్ పదవులు వస్తుండటంపై నేతలు పురందేశ్వరీ దృష్టికి తీసుకెళ్లారట.. మొత్తం పోస్టులలో బిజేపీకి ఆరు రాష్ట స్థాయి పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లంకా దినకర్ కు పదవి ఇవ్వడంతో.. తమ పరిస్థితి ఏంటని సీనియర్లు మథన పడుతున్నారని టాక్.. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news