హర్యానా సీఎం పీఠం ఎవరికి దక్కబోతోంది..? అధిష్టానం మనస్సులో ఉన్నదెవ్వరు..?

-

హర్యానాలో బిజేపీ అదరగొట్టింది.. మూడోసారి అధికార పీఠాన్ని అధిరోహించింది.. అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకుని.. 49 సీట్లను సాధించి.. తమకు తిరుగులేదని నిరూపించింది.. అధికారం దక్కుతుందని ఆశపడ్డ కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు.. అయితే హర్యానాలో మరోసారి పాగావేసేందుకు బిజేపీ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమనే చెప్పాలి.. ఎన్నికలకు కేవలం 200 రోజుల ముందే హర్యానాకు కొత్త సీఎంను బిజేపీ ఎంపిక చేసింది.. ఈ ప్రయోగం విఫలమవుతుందని అందరూ భావించినా.. సక్సెస్ కొట్టింది..

లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీని బిజేపీ ఎంపిక చేసింది.. గతంలో ఉన్న సీఎంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో.. బిజేపీ సీఎంను మార్చిందని.. ఈ ప్రయోగం అట్టర్ ప్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ బిజేపీ సీఎంను మార్చడం ద్వారా ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను తగ్గించుకోగలిగింది..

బిజేపీ మీద పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.. మహామహులు హర్యానాలో దిష్ట వేశారు.. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, భూపేంద్ర హుడా, దీపేంద్ర హుడా హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వారి హడావుడి చూసిన ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలనుఇచ్చాయి.. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కావని హర్యానా ఫలితాలు చూపెట్టాయి.. హర్యానాలో బిజేపీ గెలుపు.. నయాబ్ సింగ్ రాజకీయ భవిష్యత్ ను మార్చబోతుందనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది..

హర్యానా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేంద్రానికి తీసుకెళ్లిన బిజేపీ..నాయబ్ సింగ్ సైనీని ఓబీసీ అభ్యర్థిగా సీఎం చేశారు. దీంతో ఆయన ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టి.. ప్రజల మనన్నలను పొందగలిగారు.. ఆయన సమర్థతవంతమైన రాజనీతి కారణంగా 90 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. సైనీ తన అతి తక్కువ హయాంలో వ్యాపారులు, యువకులు, వెనుకబడిన తరగతులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన అనేక పథకాలను అమలు చేయగలిగారు.అగ్నివీర్‌లకు ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందించడానికి కృషి చేశారు..

ఈ నేపథ్యంలోనే హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నయాబ్ సింగ్ సైనీ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు కమల నాధులు చర్చించుకుంటున్నారు.. అయితే మరికొంతమంది సీనియర్లు కూడా పోటీలో ఉన్నారు.. రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ విజ్‌, కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ సీఎం పదవిపై అశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. గట్టిపోటీ ఉన్న నేపత్యంలో కేంద్రంలోని పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news