ENG Vs PAK : రెచ్చిపోయిన హ్యారీ బ్రూక్.. పాక్ పై ట్రిపుల్ సెంచరీ..!

-

ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో మొదటి ఇన్నింగ్స్ లోనే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రికెటర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో హ్యారీ బ్రూక్స్ కూడా చేరాడు.

ముల్తాన్ వేదికగా పాకిస్తాన్ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూకుడుతో బంతులు ఆకాశాన్ని అంటాయనేలా చెలరేగాడు. ముల్తాన్ వికెట్ పై పాక్ బౌలర్ల కు బ్రూక్ చుక్కలనే చూపించాడు. అతన్ని ఆపడం ఎవ్వరితరం కాలేకపోయింది. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్సులతో బ్రైక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్ ను సాధించాడు. అంతకు ముందు చాలా మంది చేశారు. ట్రిపుల్ సెంచరీ సాధించిన 32వ క్రికెటర్ గా రికార్డు లిఖించుకున్నాడు బ్రూక్.

Read more RELATED
Recommended to you

Latest news