సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. ప్రకటించిన దిల్ రాజ్

-

సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత  దిల్ రాజ్ తాజాగా ప్రకటించారు. విజయదశమి పండుగ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ 25కి విడుదలవుతుందని ఇటీవలే దిల్ రాజు ప్రకటించేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందనే చెప్పాలి. 2025 సంక్రాంతి పండుగకు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.

వాస్తవానికి క్రిస్మస్ పండుగకే రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బెస్ట్ అనిపించి రిలీజ్ డేట్ మార్చామని తెలిపారు. అదే సమయంలో రావాల్సిన మెగాస్టార్ చిరంజీవి విశంభర మూవీ రిలీజ్ డేట్ మార్చుకునేందుకు ఆ చిత్ర యూనిట్ అంగీకరించింది అని దిల్ రాజు ఓ వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవికి, దర్శకుడు వశిష్ట, చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news