సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై ఇద్దరు దుండగుల అత్యాచారం

-

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి నుంచి జాబ్ ముగించుకుని ఆటోలో వెళ్తున్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగినిపై ఆటోడ్రైవర్ తో పాటు మరో వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి ప్రతిరోజు లాగే సోమవారం ఆఫీస్‌కి వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఆటోలో ఇంటికి వస్తోంది.

Twist in the incident of hindupura case

ఈ క్రమంలోనే మసీదు బండ సమీపం వద్దకు రాగానే ఆటో ఆపిన డ్రైవర్, తన ఫ్రెండ్‌తో కలిసి అందులోనే యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news