నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల విచారణ

-

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ,ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆర్డర్స్​ సైతం జారీ చేశారు.ఈ క్రమంలోనే డీఓపీటీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. కాగా, వీరు దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్‌లో మంగళవారం విచారణ జరగనుంది.

గతంలో ఏపీకి కేటాయించి ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్స్​ వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్‌ కేడర్ అంజనీ కుమార్, అభిలాశ్​ బిస్త్, అభిషేక్‌ మహంతి ఉన్నారు.ఇక ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో ఐఏఎస్‌ ఆఫీసర్లు సృజన, శివశంకర్, హరికిరణ్‌ ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న ఎస్‌.ఎస్‌.రావత్, అనంతరాము అభ్యర్థనలను డీవోపీటీ రిజక్ట్​ చేసింది.దీంతో వీరిద్దరూ ఏపీలోనే కొనసాగనున్నారు.కాగా, క్యాట్ ఐఏఎస్‌ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా అనేది నేడు తేలనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news