Film Nagar: రామానాయుడు స్టూడియోస్ దగ్గర రోడ్డు ప్రమాదం..యువకుడు మృతి

-

హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ TS09EM9125 పై వెళ్తున్న నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. షేక్ పెట్ నుండి ఫిలిం నగర్ వెళ్లే రామానాయుడు స్టూడియోస్ రోడ్డు సమీపంలో ఫ్లోర్ మిల్ షాప్ గోడను ఢీకొని మృతి చెందాడు. మద్యం మత్తులో వేగంగా వచ్చిన స్కూటీ గోడను ఢీ కొట్టింది. ఈ తరుణం లోనే.. ఆ యువకుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

తెల్లవారు ఫిలిం నగర్ వెళ్లి వస్థానని ఇంట్లో చెప్పి స్కూటీ పై బయలుదేరాడు నవీన్. కానీ మద్యం మత్తులో ఫిలిం నగర్ లోని ఫ్లోర్ మిల్ షాప్ గోడను ఢీకొని మృతి చెందాడు. షేక్ పెట్ లో నివాసం ఉంటున్నాడు నవీన్. ఇక నవీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news