ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్ల ఆవేదన.. ఫోకస్ పెట్టిన సీఎం..

-

ఏపీలో తిరుగులేని మెజార్టీతో ఏపీలో అధికారాన్ని చేపట్టింది కూటమి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసి.. 164 స్థానాలను కైవసం చేసుకుంది.. టీడీపీ అత్యధిక స్తానాలను గెలుచుకుంది.. ఇంత మెజార్టీ స్థానాలను గెలచుకున్నామన్నా ఆనందం పార్టీ ముఖ్యనేతల్లో కనిపించడంలేదట.. పదవులు లేకపోవడంతో అనుచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని వారు మధనపడుతున్నారని ప్రచారం జరుగుతోంది..

గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి.. భారీ విజయాన్ని స్వంతం చేసుకున్నాయి.. పొత్తుల వల్ల టీడీపీ సినియర్ నేతలు టిక్కెట్ కోల్పోవాల్సి వచ్చింది.. చంద్రబాబు రంగంలొకి దిగి వారి అలకలు, బుజ్జగింపులతో కొద్దిరోజులు అధిష్టానం తలలుపట్టుకున్నా.. క్రమంగా అది తగ్గి.. అభ్యర్దుల గెలుపుకోసం అసంతృప్తులు పనిచేస్ స్థాయికి వచ్చింది..చివరికి అభ్యర్దులు గెలిచారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. అస్సలు కథ ఇప్పుడే మొదలైంది..

చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది నేతలు టిక్కెట్లను త్యాగం చేశారు.. పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని నేతలు భావించారు.. కానీ నామినెటెడ్ పదవుల భర్తీలో సీనియర్లుకు ప్రాధాన్యత దక్కలేదు.. వారి త్యాగాలను అధిష్టానం గుర్తించలేదని కృష్ణాజిల్లా సీనియర్లు ఆవేదన చెందుతున్నారట.. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే.. 13చోట్ల నేరుగా పోటీ చేసి గెలిస్తే.. రెండు చోట్ల బిజేపీ, ఒక చోట జనసేనపోటీ చేసి గెలిచాయి..

మైలవరం నుంచి మూడు సార్లు పోటీ చేసిన గెలిచిన దేవినేని ఉమాకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు.. ఆయన స్థానంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు.. పవర్ లోకి వచ్చిన తర్వాత ఉమాకు నామినెటెడ్ పదవి దక్కతుందని భావించినా..ఇంత వరకు ఏమీ దక్కలేదు.. ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గానే ఉన్నారు.. మరోనేత పెమ్మసాని సుబ్బారావు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది..

కృష్ణాజిల్లాలోని సీనియర్ నేతలందరూ రెండో లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.. తమ త్యాగాలను చంద్రబాబునాయుడు గుర్తించి.. తమకు ప్రాధాన్యత కల్గిన పదవి ఇస్తారని సీనియర్లు ఆశతో ఎదురుచూస్తుంటే..మరికొందరు మాత్రం పార్టీ పవర్ లోఉన్నా.. తమకు ప్రయార్టీ కరువైందని లోలోనా మధనపడుతున్నారట.. మొత్తంగా కృష్ణాజిల్లా నేతలను సీఎం గుర్తిస్తారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news