రాజకీయాల్లోకి రాజ్‌ ఠాక్రే వారసుడు.. ఆ స్థానం నుంచి బరిలోకి!

-

వచ్చే నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల కూటములు ఎన్నికల కోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తన కొడుకు అమిత్ ఠాక్రే చేత పొలిటికల్ ఎంట్రీ చేయించాలని భావిస్తున్నారు.

దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో అమిత్ ఠాక్రే పోటీ చేయడం కన్ఫామ్ అని తేలిపోయింది. ముంబయిలోని ‘మాహిం’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిత్ ఠాక్రే పోటీ చేస్తారని ఎంఎన్ఎస్ ప్రకటించింది. అంతేకాకుండా, 45 మంది అభ్యర్థుల జాబితాను సైతం ఎంఎన్ఎస్ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో అమిత్ ఠాక్రే పేరు కూడా ఉంది. ఎంఎన్ఎస్ ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ సందీప్ దేశ్‌పాండే వర్లీ నుంచి, పార్టీ ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ పాటిల్ కళ్యాణ్ రూరల్ సీటు నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news