చెన్నపట్నం వేదికగా టప్ పైట్ .. బరిలో కీలక నేతలు..

-

కర్ణాటక పొలిటికల్ స్క్రీన్ పై మరో టప్ పైట్ జరుగబోతుంది.. ముడా స్కామ్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు సిద్దమవుతోంది.. కర్ణాటకలోని చన్నపట్న, షిగ్గావ్, సండూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి..23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మూడు నియోకవర్గాల్లో గెలిచి సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మీద పైచేయి సాధించేందుకు బిజేపీ-జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది..

మూడు స్తానాల్లో ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. తగ్గేదేలా అంటూ.. బిజేపీ-జేడీఎస్ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.. సీఎం సిద్దరామయ్య కుటుంబం అవినీతికి పాల్పడిందని, ముడా స్కామ్ లో చిక్కుకున్నారని ఉప ఎన్నికలల జోరుగా ప్రచారం చేయడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే అందరి దృష్టి చెన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం మీద పడింది..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెన్నపట్నం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి కూడా ఆయన పోటీ చెయ్యడంతో అక్కడ కూడా గెలుపొంది.. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.. అయితే చెన్నపట్నం నుంచి తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని బరిలోకి దింపి గెలిపించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంమీదే అందరి ఫోకస్ పడింది.. వారిద్దరిలో ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చలు మొదలయ్యాయి..

నిఖిల్ కుమారస్వామితో పాటు.. మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ కూడా వరుపగా రెండుసార్లు ఓడిపోయారు. రెండుసార్లు ఓడిపోయిన ఇద్దరు నేతలు ఇప్పుడు చెన్నపట్నం వేదికగా తలపడుతున్నారు.. నిఖిల్ ను గెలిపించుకోవడానికి బిజేపీ-జేడీఎస్ నేతలు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.. మరో పక్క అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్దిని మంచి మెజార్టీతో గెలిపించాలని పట్టుదలతో ఉంది.. వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news