మీ పై నరదిష్టి ఉందని చెప్పే సంకేతాలు ఇవే..! తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా?

-

ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్‌ ఫుల్‌.. నర దిష్టికి నాపరాళ్లు కూడా పగిపోతాయి అని మన పెద్దోళ్లు ఊరికే అనరు కదా. అది నిజమే. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్న‌ట్టే.. ఈర్ష, ద్వేషంతో చూసే చూపున‌కు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది. మ‌న చెడు కోరుకునేవారు చూసే చూపు మ‌న జీవితంపై దుష్ప్ర‌భావం పడేలా చేస్తుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపుని చెడు దృష్టి లేదా న‌ర‌దిష్టి అని పిలుస్తారు. న‌ర‌ దిష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది.

దిష్టి తగిలితే ఎదురయ్యే సంకేతాలు..

  • దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టిన సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి. అనుకున్న పని ఏది పూర్తి కాదు.
  • దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు.
  • ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాభ‌రాప‌డ‌టం, ఏ ప‌నిమీదా మ‌న‌సు ల‌గ్నం చేయ‌లేక‌పోవ‌డం, విప‌రీత‌మైన కోపం, అతిగా ఆలోచించ‌డం, త‌గినంత విశ్రాంతి తీసుకున్నా నిస్స‌త్తువ‌గా ఉండ‌టం, ఆర్ఘిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌డం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు.

న‌ర దిష్టిని ఎదుర్కొనేందుకు చిట్కాలు

చెడు, దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కార్యాలయాన్ని రక్షించడానికి ఎండు మిరపకాయలు, నిమ్మకాయల‌ను ఒక దారంలో కట్టి, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయ‌డం మ‌న దేశంలోని అన్ని ప్రాంతాల్లో స‌ర్వ‌సాధార‌ణం. రెండు ఎండుమిర‌ప‌కాయ‌లు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. న‌ర దిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి, ఆపై వాటన్నింటినీ కాల్చివేయాలి.

తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి, ఆ నీటిని గోమూత్రంతో కలపండి. ఈ మిశ్రమాన్ని అమావాస్య, పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చ‌ల్లాలి.

ఇంట్లో గర్భిణీ ఉంటే, ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్లేలా చూసుకోవాలి. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ఆకులన్నింటినీ కాల్చేయాలి. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధ‌చంద్రాకారాన్ని ఉంచండి.

ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది న‌ర దిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. ఒక గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అంద‌రికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news