ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈదుపురంలో అంబటి శాంతమ్మ అనే మహిళా ఇంట్లో పొయ్యి పెట్టి దీపం వెలిగించారు సీఎం చంద్రబాబు. ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉచిత సిలిండర్ బిగించి పొయ్యి వెలిగించారు చంద్రబాబు. అనంతరం స్వయంగా టీ తయారుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ, ఎమ్మెల్యేలున్నారు.
ఆ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు సీఎం చంద్రబాబు. ఈ సమయంలో ఆ మహిళా చంద్రబాబుకు మీరే మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అంతకు ముందు కట్టెలపొయ్యి పెట్టి వండుకునే వాళ్లం. చాలా ఇబ్బందులు ఎదుర్కున్నామని తమ సమస్యను చంద్రబాబుకి వివరించింది. అలాగే మీరే స్వయంగా మా ఇంటికి వస్తారని అస్సలు అనుకోలేదని చెప్పింది. నేనే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం వచ్చామని చంద్రబాబు ఆ మహిళకు చెప్పాడు. చంద్రబాబు చూసి ఆ మహిళా చాలా సంతోషం వ్యక్తం చేసింది.