మాజీ మంత్రి మేరుగ నాగార్జున చిక్కుల్లో పడనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనను లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మోసం చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మేరుగ నాగార్జున మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టు పనుల పేరుతో రూ. 90 లక్షలు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ ఆరోపించారు.
డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే చంపేస్తానని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. గిరిజన శాఖలో పని చేసిన ఉపాధ్యాయురాలని స్లో పాయిజన్ ద్వారా చంపేశామని, ఇప్పుడు అదే గతే పడుతుందని నాగార్జున పీఏ మురళి బెదిరించారని తెలిపారు. అంతేకాదు తనను లైంగికంగా కూడా వేధించాడని నాగర్జునపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజును ఆమె కోరారు. ఇక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు.