ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణాలో పూర్వ వైభవం కోసం పావులు కదుపుతోంది.. వారానికి రెండు రోజులు తెలంగాణాలో ఉంటూ.. పార్టీ పటిష్టతపై చంద్రబాబునాయుడు ఫోకస్ పెట్టారు.. ఈ క్రమంలో గతంలో టీడీపీలో ఉన్న సీనియర్లను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి, బాబూ మోహన్ లాంటి వాళ్లు చంద్రబాబునాయుడుతో టచ్ లో ఉన్నారు.. బాబూ మోహన్ ఇటీవల పార్టీ సభ్యత్వాన్ని సైతం తీసుకున్నారు..
తెలంగాణ టీడీపీ అద్యక్షుడి ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు.. సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో బలమైన నేతను అధ్యక్షునిగా చెయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారట.. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతని అధ్యక్షునిగా ఎంపిక చేసింది.. బిజేపీ కూడా ఇదే బాటలో నడబోతుంది.. ఈ క్రమంలో బీసీ లేదా దళిత నేతను అధ్యక్షున్ని చెయ్యాలని చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఉన్నారట..
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. బిజేపీ, బీఆర్ఎస్ లు పుంజుకుంటున్నాయి. .ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా పూర్వ వైభవం కోసం పావులు కదుపుతూ ఉండటంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉండే కీలక నేతలుందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే.. అయితే వారిలో కొందడరు అసంతృప్తిగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరగుతోంది..
చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లిన ప్రతిసారి కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఆయన్తో భేటీ అవుతూ ఉండటంతో రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.. దీంతో అధ్యక్షున్ని త్వరగా ఎంపిక చెయ్యాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ అద్యక్ష రేసులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.. నెల రోజుల క్రితం చంద్రబాబును బాబూమోహన్ కలిశారు. అలాగే, రెండు రోజుల క్రితం ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని తీగల కృష్ణా రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.. చంద్రబాబు మాత్రం బాబూ మోహన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..