Money: జాబ్ రాగానే డబ్బు విషయంలో అందరూ చేసే పొరపాట్లు ఇవే..

-

ప్రస్తుత కాలంలో డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా డబ్బులేని మిమ్మల్ని జనాలు నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి డబ్బును ఎల్లప్పుడూ చేతుల్లో ఉంచుకోవాలి.

అయితే యువకులు డబ్బు విషయంలో చాలా పొరపాట్లు చేస్తారు. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం సాధించిన వాళ్లు పొరపాట్లు చేయడంలో ముందు ఉంటారు. ఆ పొరపాట్లు చేయకపోతే లైఫ్ ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.

బడ్జెట్ లెక్కలు వేసుకోకపోవడం:

ఒక నెలలో మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది కచ్చితంగా లెక్కలు వేసుకోవాలి. ఇంటి అద్దె, కిరాణం ఖర్చులు.. మొదలుకుని సినిమాలు షికారులు అన్నింటిని బడ్జెట్లో వేసుకోవాలి. లేకపోతే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్లు గ్యాడ్జెట్లపై ఖర్చులు:

కొత్త జాబ్ రాగానే కొత్త ఫోను, కొత్త కొత్త గ్యాడ్జెట్లు కొంటుంటారు. అవి నిజంగా అవసరమైతే ఓకే. కానీ ఏదో అందరూ కొంటున్నారు కదా అని కొనేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకొంతమంది ఫస్ట్ శాలరీ పడగానే కార్ కొనాలని చూస్తారు. అవసరం లేకపోయినా ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది.

సేవింగ్స్ చేయకపోవడం:

ఇప్పటి యువత సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సంపాదించిన ప్రతీ పైసాను ఆనందం కోసమని, అభివృద్ధి కోసమని ఖర్చు చేస్తున్నారు తప్ప వయసు అయిపోయిన తర్వాత వాడుకోవడానికి పొదుపు చేయడం లేదని అంటున్నారు. ఒక వయసు వచ్చాక ఇప్పటిలా ఆరోగ్యంగా ఉండలేరు కాబట్టి కచ్చితంగా సేవింగ్స్ చేయాలి.

ఇన్సూరెన్స్ మర్చిపోవడం:

హెల్త్ ఇన్సూరెన్స్ గానీ లైఫ్ ఇన్సూరెన్స్ గాని కచ్చితంగా తీసుకుంటే ఫ్యూచర్లో మీకు ఖర్చులు తక్కువగా అవుతాయి. చాలామంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news