ఆ నియోజకవర్గంలో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు.. ఇన్చార్జి బాధ్యతలు ఎవరికో..?

-

బీఆర్ఎస్ పార్టీ హ్యట్రీక్ విజయాలు అందుకున్న ఆ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.. క్యాడర్ ను నడిపించే నేత కోసం అన్వేషణ మొదలు పెట్టింది.. సీనియర్లను తెరమీదకు తీసుకురావాలా.. లేక పక్క పార్టీలో ఉండే నేతల్ని పార్టీలోకి చేర్చుకోవాలా అనేదానిపై కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడింది.. ఇంతకీ కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న నియోజకవర్గమేదో మీరే చూడండి..

జహీరాబాద్‌.. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ ఏర్పాటు తర్వాత అది బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయింది.. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్దులే ఇక్కడి నుంచి విజయాలు అందుకుంటున్నారు.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండోసారి పోటీ చేసిన మాణిక్ రావు 12వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ది చంద్రశేఖర్ పై గెలుపొందారు.. దీంతో జహీరాబాద్ లో పాగా వెయ్యాలని భావించిన కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి.. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో.. బలమైన నేతను బరిలోకి దింపాలని హస్తం పార్టీ సిద్దమవుతోంది..

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బగారెడ్డి , గీతారెడ్డిలాంటి హేమాహేమీలు కాంగ్రెస్ కంచుకోటగా నిలిపారు.. బాగారెడ్డి మరణం తర్వాత.. గీతారెడ్డితో పాటు దివంగత ఫరీదుద్దీన్.. నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కాపాడారు. అయితే 2018లో గీతారెడ్డి ఓటమితో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోతూ వచ్చింది.. ఈ సమయంలో బీఆర్ఎస్ పుంజుకుంది.. 2023 ఎన్నికల్లో గీతారెడ్డి పోటీకి దూరంగా ఉండటంతో.. మాజీ మంత్రి చంద్రశేఖర్ ను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.. అయితే ఆయన ఓటమి పాలయ్యారు..

గీతారెడ్డి సహకారం లేకపోవడం వల్లే చంద్రశేఖర్ ఓడిపోయారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో కొత్తవారిని ప్రోత్సహించాలని హస్తం పార్టీ భావిస్తోందట.. జహీరాబాద్ ఎంపీపీగా ఉన్న గిరిధర్ రెడ్డి.. ప్రజల్లోకి వెళ్తున్నా.. ఆయన సమర్దుడు కాకపోవడంతో.. పక్క పార్టీల్లో ఉండే నేతల్ని పార్టీలోకి లాక్కోవాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది.. నియోజకవర్గంలో సీనియర్ నేతలుగా ఉన్న గీతారెడ్డి, దామోదర్ రాజనరసింహా వంటి నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. బలమైన నేతను ఇన్చార్జిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారట.. ఎవరిని పార్టీలోకి లాక్కుంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news