టీడీపీ-జనసేన-బీజేపీ మూడు పార్టీలు కూటమిగా కలిసి ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు ఉంటాయని.. వాటిని కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. జిల్లా ఇన్ చార్జీ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన అనంతరం తొలిసారి ఆయన కాకినాడకు వచ్చారు. కూటమి నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీలలో ఎలాంటి కుమ్ములాటలు లేవని తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం.. మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇన్ చార్జ్ మంత్రి గా ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదని తెలిపారు. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ చార్జుల తమ నియోజకవవర్గ అభివృద్ది పైనే ఎక్కవగా చర్చించారు. రూ.10లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఖజానాను జగన్ ఖాలీ చేసి వెళ్లిపోయారని తెలిపారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడేశారని తెలిపారు. అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్తను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.