విజయనగరం స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలుపుకోవాలని భావించి ఇవాళే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తమ అభ్యర్థి అని జగన్ ప్రకటించేశారు. ప్రకటించిన కొద్ది సేపటికే కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది.
రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం 34 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 389 ఎంపీటీసీ స్థానాలకు గానూ 389 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తాజాగా విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. శాసన మండలి చైర్మన్ నిర్ణయాన్ని కోర్టు తోసి పుచ్చింది. దీంతో రఘురాజు నవంబర్ 2027 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మరోవైపు ఇటీవలే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల విషయం తెలిసిందే.