ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినా పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి కొద్ది సేపట్లోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు పవన్. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశముంది.
పవన్ కళ్యాణ్ పర్యటన పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.