మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బతికి ఉన్నంత వరకు మళ్లీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తీసుకురావాలని ఇండియా కూటమి కుట్రలు చేస్తుంది. కానీ పాకిస్తాన్ తో సహా ప్రపంచంలోని ఏ వక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్దరించదు అంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ ఆ గాడి నేతలు పోట్లాడుకుంటున్నారని ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో విష బీజాలు నాటి దేశంలో ఉన్న గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.