కలెక్టర్ పై దాడిలో రాజకీయకుట్ర కోణం వుంది : టీజీవో ప్రెసిడెంట్

-

కలెక్టర్ పై జరిగిన దాడిని బ్లాక్ డేగా చూడాలి. పార్మా సిటీ కోసం భూసేకరణ కోసం సమావేశం కాదు.. అభిప్రాయసేకరణ జరుగుతుంటే దాడిచేయడం బాధాకరం అని టీజీవో ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస రావు అన్నారు. కలెక్టర్ నుండి కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది వరకు అందరి పై దాడిచేశారు. బండలతో, కర్రలతో, చెప్పులతో దాడి చేశారు. అలాగే కులగణన పై కూడా కొందరు నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

మేము గత 20,30 ఏండ్లుగా ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు. మాకు ఉద్యమం చేయడం కూడా తెలుసు. మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసినం. అయితే ఈ దాడిపై సీఎం స్పందించారు. కానీ మిగతా పార్టీల నేతలు ఖండించలేదు. అయితే ఇందులో ఏదో రాజకీయకుట్ర కోణం వుంది. ఈ కేసులో చట్టపరంగా దోషులను శిక్షించాలి అని డీజీపీ, సీఎస్ ను కలిశాం. నవీన్ మిట్టల్ ను కూడా కలిసి చెప్పాము. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వున్నా.. పనిచేసేది ఉద్యోగులే.. కాబట్టి ఉద్యోగులను కించపరచకండి అన్నికోరుతున్నాం అంటూ టీజీవో ప్రెసిడెంట్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news